మానవసేవే మాధవసేవ..
చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి..
వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం…
త్వరలో రూ” లక్షతో బోరు పంపు సెట్ ప్రజలకు అంకితం చేస్తాం…
*ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డీ విజయ భాస్కర్ రెడ్డి..
మన్యం న్యూస్, మంగపేట.
మానవసేవే మాధవ సేవ అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళవారం ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం టి కొత్తగూడెం జంట గ్రామాల మధ్య రైతు భవనంలో నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలివేంద్రాన్ని నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజాసేవను ఒక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాల ప్రజానీకానికి శీతల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని సాంబశివరెడ్డి జంట గ్రామాల ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాల ప్రజలకు ఇప్పటికే తమ ట్రస్టు ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించామని త్వరలోనే త్రాగునీటి కోసం రెండు గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రూపాయిలు లక్షతో తమ ట్రస్టు ద్వారా బోరు మోటార్ పంప్ సెట్ ని ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు దీంతో రెండు గ్రామాల కూడలి వద్ద మంచినీటి అసౌకర్యం సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాసిరెడ్డి కృష్ణారెడ్డి నాగిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి లక్ష్మారెడ్డి లక్కీ వెంకన్న రాట్నాల నరేష్ రెడ్డి పాడి ఈశ్వర్ రెడ్డి శెట్టిపల్లి గంగరాజు ఇనుకుర్తి సురేష్ తిరుపతిరావు ప్రసాదు మందడపు సాంబశివరావు దినసరపు భాస్కర్ రెడ్డి దొడ్డ రాజు అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.