వృద్ధులకు,వికలాంగులకు అన్నదానం
మన్యం న్యూస్ కరకగూడెం…పెళ్లిరోజు సందర్భంగ
వృద్ధులకు వికలాంగులకు టిడిపి మండల అధ్యక్షుడు సిరి శెట్టి కమలాకర్ దంపతులు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అశ్వాపురం మండలంలోని హారిపా, రోషిని, వృద్ధాశ్రమంలో వికలాంగులకు వృద్ధులకు 30 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పెళ్లిరోజు డబ్బులు వృధా కాకుండా వయసు పైబడిన ఎన్నో కష్టాలు అనుభవించిన పెద్దలు ఆరిఫా, రోషిని వృద్ధాశ్రమంలో ఉండడంతో వారికి ఒకరోజు భోజనం అందించడం తమకు చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి పిల్లలు భావజ్ఙ,శ్యాంకౌశిక్ పాల్గొన్నారు.
