మన్యం న్యూస్ గుండాల గుండాల మండల కేంద్రం తో పాటు మండలంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ జెండా పండుగ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. లింగాగూడెం, చెట్టుపల్లి, కాచనపల్లి గ్రామాలతో పాటు మిగతా గ్రామాలలో సైతం జెండా ఎగరవేసి ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ పార్టీ జెండా ఎగరవేసి ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, పార్టీ నాయకులు సుధాకర్, ప్రమోద్, గిరిబాబు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు
