UPDATES  

 సింగరేణిలో మెడికల్ ఆఫీసర్ వింతపోకడ డైరెక్టర్లను, జీఎంల ఆదేశాలను ఖాతరు చేయని వైనం మెడికల్ బోర్డు విషయంలో వైఖరిపై తీవ్ర విమర్శలు

 

మన్యంన్యూస్,కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో నల్ల బంగారంగా పేరుగాంచిన సింగరేణి సంస్థ తెలంగాణకు కీర్తి కీరీటంలా నిలిచిన విషయం విదితమే. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగం కంటే సింగరేణి కొలువు వైపే ప్రస్తుత యువత మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే అన్నిరకాల సౌకర్యాలు సింగరేణి సంస్థ ఉద్యోగులకు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను నిలిపివేశారు. ఆ తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో మళ్లీ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించింది. దీంతో కేసీఆర్ నిర్ణయంతో కార్మికుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగాలను వారసత్వంగా ఇవ్వాలని పరిగణించింది. కానీ అనూహ్యంగా వారసత్వ ఉద్యోగాలను సవాలుచేస్తు ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక కూలీ పనులు చేస్తున్నారని, అటువంటిది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు సింగరేణిలో ఉద్యోగాలను ఇవ్వకుండా ఏనాడో నిలిపివేసిన వారసత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం బాధాకరమని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగాలను మెడికల్ బోర్డు కిందకు తీసుకువచ్చి అనారోగ్యం పాలైన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఆ ఉద్యోగాన్ని వారసత్వంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్ బోర్డులో 18 రకాల వ్యాధులను చేర్చి ఆ జబ్బులతో బాధపడుతున్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలను ఇవ్వటానికి రాష్ట్రప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ విషయంలో మెడికల్ బోర్డు అధికారి క్రియాశీలకంగా వ్యవహరించటం జరుగుతుంది. కానీ ప్రస్తుత సీఎంఓ అధికారి మాత్రం ఒంటెద్దు పోకడలను అవలంబిస్తూ ఉద్యోగులపాలిట విచిత్ర వైఖరి ప్రదర్శిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాత్రం ఉద్యోగుల పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని, కార్మిక సంఘాల నాయకులను మభ్యపెడుతున్నాడన్న ఆరోపణలు లేకపోలేదు. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఉద్యోగుల పక్షాన కార్మిక నాయకులు అతనిని సంప్రదించగా నిష్పక్షపాతంగా మాయమాటలు చెబుతూ కాలం గడపటం అతని బిన్నశైలిగా మెడికల్ ఆఫీస్ ఉద్యోగులు సైతం వాపోతున్నారు. అన్నిరకాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులను సమస్య ఉన్నట్లు తేటతెల్లం అయినప్పటికీ అన్ ఫిట్ చేయకుండా ఫిట్ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. సింగరేణిలో సర్ఫేస్ లో, వివిధ కార్యాలయాల్లో ప్యూన్లుగా, అటెండర్లుగా, రైటర్లుగా, నర్సులుగ, క్లర్కులుగా విధులు నిర్వహించే ఉద్యోగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా వారిని సైతం అన్ ఫిట్ చేయకపోగా కేవలం అండర్ గ్రౌండ్ , మైన్లలో విధులు నిర్వర్తించే వారికే వారసత్వ ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తూ మిగిలిన కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సింగరేణి ఉద్యోగి సర్వీసు రెండేళ్లకు మించి ఉన్న సమయాల్లో వారి కొడుకుల వయసు 35 సంవత్సరాలు ఉన్నచో అటువంటి వారి పిల్లలకు ఉద్యోగాన్ని వారసత్వంగా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ విషయంలో అట్టి ఉద్యోగస్తుల పిల్లలకు కనీసం పదవతరగతి ఉండాలనే కొత్త నిబంధనను పెడ్తున్నారని , అసలే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారి పిల్లలు చదువుపై ఆసక్తి లేక వారి బాల్యపు కాలంలో సింగరేణిలో ఇప్పుడున్నంత అధిక మొత్తం జీతభత్యాలు లేని కారణంగా కూలీ పనులు చేస్తూ ఆటోలు తోలుకుంటు జీవనం సాగిస్తున్నారు. వారు కేవలం వారి తండ్రి అనారోగ్యం ద్వారా సంక్రమించే ఉద్యోగమే వారికి కల్పతరువుగా భావిస్తున్న సమయంలో ఆ అధికారి సింగరేణిలో లేని ఈ విధమైన నూతన విధానాలను సృష్టిస్తున్నారు అని వాపోతున్నారు. అయినా ఈ విషయంలో అట్టి దరఖాస్తులను పెండింగ్లో పెడుతూ ఆయన నిర్లక్ష్య వైఖరితో కార్మికుల కుటుంబంలో శోకాన్ని మిగిల్చిన ఘటనలు సైతం ఉన్నట్లు వినికిడి. అనారోగ్య కారణాల రీత్యా సర్వీసు చివరి రెండేళ్లలో మెడికల్ బోర్డుకు పెట్టుకున్న ఉద్యోగులకు సైతం మొండిచేయి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !