మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షానికి దెబ్బ తిన్న పంటలను సర్వే చేసి, నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరివారిగూడెం, జూలూరుపాడు గ్రామాలలో దెబ్బ తిన్న మొక్క జొన్న పంటలను కొత్తగూడెం సహయ వ్యవసాయ సంచాలకులు టీ కరుణ శ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన రైతుల పొలాలను సందర్శించి, పంట వివరాలను నమోదు చేసి, పూర్తి నివేదికలను వెంటనే అందజేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో మండల వ్యవసాయ అధికారి ఎస్ రఘు దీపిక, వ్యవసాయ విస్తరణ అధికారులు బి గోపి కృష్ణ, ఎంఏ గౌస్, రైతులు తదితరులు పాల్గొన్నారు