దేశం చూపు తెలంగాణ వైపు
తెలంగాణ రాష్ట్రానికి కారణజన్ముడు కెసిఆర్
పగటివేషగాల్లకు తెలంగాణ అభివృద్ధి చెంపపెట్టు
ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో..ఘనంగా బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భారతదేశంలో 65 సంవత్సరాలుగా ఏలిన అనేక పార్టీల పరిస్థితులు చూస్తే అగమ్యగోచనంగా మారిందని ప్రజా శ్రేయస్సు కోరుతూ చక్కదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలను మభ్యపెడుతూ అనేక హామీలను తుంగలో తొక్కుతూ దేశ అభివృద్ధికి అవరోధాలు ఏర్పరిచిన ప్రబుద్ధుల నుంచి తాము కోలుకోవాలని దేశ ప్రజలు ప్రస్తుతం తెలంగాణ వైపుకు చూస్తుందని దేశ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాలు అమలు చూసి దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపుకు చూస్తున్నారని వినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు., తొలిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు, ప్రొఫెసర్ జయశంకర్ సlచిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో 22 ఏండ్లు పార్టీ ఆవిర్భావం 9 ఏండ్ల ప్రగతి ప్రస్థానం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు, దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేలా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజాధరణ మద్దతు వస్తున్న విషయం తెలిసిందే అన్నారు, నాడు పార్టీ ఆవిర్భావం చేసి అనతి కాలంలోనే దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు అందిస్తుంది పేద ప్రజలకు రైతులకు చేస్తున్న పథకాలు గొప్పవి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు, ఆదిశగానే జాతీయ పార్టీగా బి ఆర్ ఎస్ ఆవిర్భావం జరుగుతుంది అన్నారు, ఘనంగా రైతు సంక్షేమం దళిత బంధు మహిళా సంక్షేమం ,పల్లె ప్రగతి పట్టణ ప్రగతి , రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, కాలేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, వితంతువులు, దివ్యాంగులు బీడీ కార్మికులు ,బోధ బాధితులు, డయాలసిస్ రోగులకు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మిషన్ భగీరథ కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు,అనేకసంక్షేమకార్యక్రమాలుఅమలవుతున్నాయి అన్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పగటివేషగాళ్ల పోజులు ఎక్కువయ్యాయని ప్రజలు వారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది అన్నారు. కళ్ళు ఉండి కూడా చూడలేని కబోధులకు ఏం చెబుతామని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశంలో కొన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీకి అడుగుపెట్టనివ్వకుండా తాము ఎదుర్కొంటామని అనేక ప్రేలాపనులు చేస్తున్న వారి ముఖం నెవ్వెరబోయేలా ప్రజలిచ్చే తీర్పే వారికి చెంపపెట్టు అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెడుతూ మసిబూసి మారేడు కాయ చేయడం లేనిపోని హామీలు ఇచ్చి మభ్యపెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాధ్యం కాదని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా తెలంగాణ బిడ్డల కోసం అనునిత్యం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారని ఈ విషయం అందరికీ తెలుసునని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధులు జేవీఎస్ చౌదరి, ఎస్కే అన్వర్, నాయకులు మోరే భాస్కర్, యూసీఫ్ రావి రాంబాబు, భీమా శ్రీధర్, రేగ యూత్ సభ్యులు పోతురాజురవి, జిల్లా బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు కర్నే మురళి, నాయకులు లావుడియా గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.