మన్యం న్యూస్ దుమ్మగూడెం ఏప్రిల్ 25::
దుమ్ముగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీనగరం గ్రామంలో 1/70 చట్టానికి విరుద్ధంగా కొంతమంది గిరిజనేతరులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని బహుళ నిర్మాణాలు చేపడుతున్నారని అట్టి వారిపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరాజ్ ఆధ్వర్యంలో తహాసిల్దార్ ప్రతాప్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కామరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్నటువంటి చట్టాలకు విరుద్ధంగా సర్వే నెంబరు 1 గల ప్రభుత్వ భూమి కొంతమంది గిరిజనేత్రులు రాజకీయ అండదండలతో బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారని వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎన్నిసార్లు వినతిపత్రం అందించిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు ప్రభుత్వ భూములు గిరిజనేతరులు నిర్మాణాలు చేపడితే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురుసం రవి నాయకులు గంగరాజు బుటారి రాజు తదితరులు పాల్గొన్నారు