మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్బంగా తెలంగాణ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలు మెరకు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని భద్రాచలం రోడ్ లో ఫామ్ ఆయిల్ తోటలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల బిఆర్ఎస్ నాయుకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో దూసుకు పోతున్నాయని. కేసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని దీనిని ప్రజలు గ్రహించి మరో మారు కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అని అన్నారు. అదే విదంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతి సమస్యను తన సమస్యగా భావించి సమస్యల పరిష్కరించడంలో ముందు ఉంటున్నానని, అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు తెచ్చానని మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టానని నియోజకవర్గానికి సేవ చేయటం నాకు దేవుడిచ్చిన వరం అని ఎవరు ఏమన్నా తిరిగి అనడం నా స్వభావం కాదని ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యం అని అన్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన గెలవకున్న కూడా నేను మీతోనే ఉంటానని, మీ మధ్యలో ఉంటానని, నియోజకవర్గం విడిచి ఎక్కడికి వెళ్ళనని, మీ సహకారంతో మీకు నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.