మణుగూరు పట్టణం లోని ఆదర్శ్ నగర్ కు చెందిన దండుగుల.అయ్యప్ప క్యాన్సర్ తో బాధపడుతున్నారు అని, ఇటీవల ఆపరేషన్ చేయించుకొని వారి నివాసానికి వచ్చారని,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,విషయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతరావు దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పదించిన విప్ రేగా కాంతరావు,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 వేల రూపాయల నగదు,50 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేయమని ఆదేశించగా గురువారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పారావు విప్,రేగా ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి సహయం అందజేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఉపాధ్యక్షలు షేక్ బాబ్జాన్,టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్,పార్టీ సీనియర్ నాయకులు వట్టం. రాంబాబు,ముద్దంగుల కృష్ణ, ఈరెల్లి అచ్చయ్య,దర్శనాల శ్రీను,నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్,మణుగూరు టౌన్ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం.సృజన్,మహిళా అధ్యక్షురాలు చంద్రకళ,యూత్ నాయకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
