UPDATES  

 నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. పోతినేని సుదర్శన్ రావు

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 27::
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వర్షాలు వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి రైతులని పంట నష్టం గురించి వివరాలు తెలుసుకుని వారిని పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట నేలపాలైందని ఆరుగారం ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పంటకు జరిగిన నష్టాన్ని నమోదు చేసి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఆహార ధాన్యాలకు ఎకరానికి ₹ 25000 వాణిజ్య పంటలకు ఎకరాకు 40000 పరిహారం చెల్లించాలని కౌలు రైతులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను అన్ని సౌకర్యాలు కల్పించి వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలమంచి వంశీకృష్ణ నియోజవర్గ కోకన్వీనర్ కారం పుల్లయ్య రైతు సంఘం సీనియర్ నాయకులు శీను బాబు మండల అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ దుమ్మగూడెం ఉపసర్పంచ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !