భద్రాద్రి జిల్లాలో యువజన కార్మిక మహిళా సమ్మేళనాలు
మే 2నుండి ప్రారంభం
ఇక పల్లెపల్లెకూ కాంతన్న
భద్రాద్రి జిల్లాలో ఐదుస్థానాల గెలుపే టార్గెట్
మన్యంన్యూస్ ప్రతినిధి-
మే 2వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు జరిగే బిఆర్ ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగం సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తీ నందుగల బిఆర్ ఎస్ జిల్లా కార్యాలయం నందు పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన మే 2వ తేదీ నాడు ఉదయం 10: గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం, నియోజకవర్గాలకు చెందిన నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు, మండల యువజన విభాగం అధ్యక్షులు, టౌన్ యువజన విభాగం అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న యువజన విభాగం నాయకులు, పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో అన్ని ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలన్నారు.