UPDATES  

 5వ తేదీన భద్రాచలంలో జరిగే మహాసభలో ఎన్నికల జయభేరి మోగించాలి.. గిరిజన సంస్కృతి అద్దం పట్టేలా టీఏజీఎస్ రాష్ట్ర 3వ మహాసభలు..

5వ తేదీన భద్రాచలంలో జరిగే మహాసభలో ఎన్నికల జయభేరి మోగించాలి..
గిరిజన సంస్కృతి అద్దం పట్టేలా టీఏజీఎస్ రాష్ట్ర 3వ మహాసభలు..
బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా భద్రాచలం నుండి పోటీకి రెడీ..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 27::
వచ్చేనెల 3, 4, 5, 6 తేదీల్లో భద్రాచలంలో జరిగే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా 5వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి ఎన్నికల జయభేరి మోగించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని ములకపాడు ఎలమంచి సీతారామయ్య భవనంలో జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వచ్చే నెలలో భద్రాచలం పట్టణంలో జరిగే తెలంగాణ ఆదివాసి సంఘం రాష్ట్ర మహాసభను 3, 4 తేదీల్లో రేలా పండుగ పేరిట ఆదివాసి సాంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్న తెలిపారు. గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా 5వ తేదీన భద్రాచల పట్టణంలో రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలతో భారీ బహిరంగ ప్రదర్శన తో పాటు సభను నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎంపీ మీడియం బాబురావు అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభకు మాజీ ఎంపీ ఆదివాసి అధికార రాష్ట్రీయ జాతీయ నాయకురాలు బృందా కారత్ మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి భీమ్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగం ఇస్తారని తెలిపారు. దేశంలో బిజెపి ప్రభుత్వంతో మతోన్మాద మహమ్మారి రూపంలో ఉందని దాన్ని తరిమికొట్టాలని అన్నారు అలానే రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కృషిచేసిన కమ్యూనిస్టులు గుర్తించిన ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ఒక అవగాహనకు వచ్చారని అన్నారు. కానీ ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ పది స్థానంలో పోటీ చేస్తుందని ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉన్న లేకున్నా సిపిఐతో రాష్ట్రవ్యాప్తంగా కుదిరిన ఒప్పందం లో భాగంగా భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి సిపిఎం పోటీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్ మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు మరణం చంద్రయ్య చిలకమ్మా సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు పిట్టల రవి జిల్లా బాధ్యుడు భూక్యా రమేష్ మండల బాధ్యుడు కుమ్మరికుంట్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !