నాడు రాష్ట్రం కోసం .. టిఆర్ఎస్
నేడు దేశం కోసం …. బీఆర్ఎస్
రేగ యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర వస్తువుల పంపిణీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
నాడు తెలంగాణను సాధించుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్షను పూనుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని ఇప్పుడు దేశ ప్రజల సంక్షేమం కోసం నూతనంగా బిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి దేశ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా భావించి అడుగు ముందుకు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రేగ యూత్ సభ్యులు పోతురాజు రవి అన్నారు.
22 ఏండ్ల మహా ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన సాగుతోంది.
కేసీఆర్ అమలు చేస్తున్న ఆదర్శవంతమైన పథకాలను ఇతరత్రా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని అన్నారు.దేశానికి దిక్సూచి కేసీఆర్ మాత్రమేనని,ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది హ్యాట్రిక్ ఖాయమని రేగా యూత్ ఇంచార్జి పోతురాజు రవి అన్నారు. ప్రజా సంక్షేమ పాలన కోసం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్నారని ఆయన సంకల్పం సిద్ధించి రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబడడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని ఆకాంక్షించారు ఈ సందర్భంగా రోడ్డు పక్కనే జీవనాన్ని సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి రేగా యూత్ ఆధ్వర్యంలో 25 కేజీల రైస్ బ్యాగ్ నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సందీప్, సునీల్, షారుక్, ఆనంద్ అగర్వాల్, సుమంత్, అలీ, చిట్టీ, సోయల్, తదితరులు పాల్గొన్నారు.