మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ ..పాల్వంచ కేంద్రంలోని పెద్దమ్మ తల్లి గుడిలో పాండురంగాపురం తండా సర్పంచ్ అజ్మీరా జగదీష్ కుమార్ రమ్య దంపతుల పుత్రిక వర్షికకు చెవులు కుట్టు మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమసంఘం రాష్ట్రఅధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్ దంపతులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రవీందర్, విజయ్, రాంబాబు, రమేష్ మరియు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
