UPDATES  

 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం.. బ్రోచర్ విడుదల చేసిన కెవి ఫౌండేషన్..

మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం..
బ్రోచర్ విడుదల చేసిన కెవి ఫౌండేషన్..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 27::
దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో కేవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముత్యాలమ్మ తల్లి గుడి క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడ పోటీలో పాల్గొనే క్రీడాకారులు తమ టీం పేర్లు మే 1వ తేది వరకు నమోదు చేసుకోవాలని అనంతరం క్రీడా పోటీలు మే 3 నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహ కమిటీ తెలిపారు. ఈ క్రీడ పోటీలను భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం రిటైర్డ్ ఏపీపి ప్రారంభిస్తారు. ఈ క్రీడ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతి 30000/- రెండో బహుమతి 20000/- నగదు పాటు సీల్డ్ బహుమతి దాత కొరస వెంకటేశ్వరరావు సివిల్ ఇంజనీర్ అందించనున్నారు. ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం కొత్తపల్లి గ్రామంలో కె.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల బ్రోచర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఏ వి ఎస్ పి మండల అధ్యక్షులు రేసు ఆదినారాయణమూర్తి, ఉప సర్పంచ్ రామచంద్రయ్య, రేసు రాంబాబు, ముర్రం వీరభద్రం,రమణ బాబు, కల్లూరి ప్రసాద్, ముద్దరాజు, సోంది రవి(అడవి ), కైఫ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !