మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 27: మండల పరిధిలోని తుంగారం పంచాయతీ టేకులబంజర గ్రామంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న వేపకలప దిమ్మెలను పారెస్టు అధికారులు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ రామవరం రేంజర్ ఉమ మాట్లాడుతూ… గ్రామాల్లో వేప చెట్లను నరికి కలప రవాణా చేయటం చట్టరీత్య నేరమవుతుందన్నారు. కలప నరికే వారిపై కేసు నమోదు చేస్తామని, ఎటువంటి చెట్లను నరకాలన్న అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వేప చెట్లను నరకే వారిపై చర్యలుంటాయన్నారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
