UPDATES  

 ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభానికి సిద్ధంగా వున్న డయాలసిస్ యూనిట్*

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చొరవతో వైద్య విధాన పరిషత్ లోకి మారి అనేక మార్పులుచేర్పులు జరిగిన సంగతి విదితమే. గతంలో ఇల్లందు ఆసుపత్రికి వెళ్లాలంటేనే నియోజకవర్గ ప్రజలు భయపడేవారు. అరకొర సౌకర్యాలకు తోడు డాక్టర్ల కొరతతో ఇల్లందు ఆసుపత్రిని సందర్శించే వారే కరువు. కానీ నేడు జిల్లా కలెక్టర్ ఆనుధీప్, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుల కృషితో అన్నిరకాలుగా అభివృద్ధి చెంది గణనీయ మార్పులు జరిగాయి. తాజాగా డయాలసిస్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేసెందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. డయాలసిస్ సెంటర్ పనులు దాదాపుగా పూర్తి అయింది. ఓకేసారి ఐదుగురికి డయాలసిస్ చేసే విధంగా బెడ్స్, డయాలసిస్ పరికరాలు, జెనరేటర్, యూనిట్స్ ను అమర్చారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ శిరీష్ కుమార్, ఆర్ఎంఓ హర్షవర్ధన్ లు మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్, డిసిహెచ్ఎస్ అధికారి అదేశాల మేరక ఇల్లందు వైద్యశాలపై నిత్యం ప్రత్యేకదృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక మున్సిపల్ ఛైర్మెన్ డీవీ హాస్పిటల్ పై ప్రత్యేక దృష్టి సారించి డయాలసిస్ సెంటర్ కు తన వంతు సాయం చేసినట్లు పేర్కొన్నారు. ఈ డయాలసిస్ సెంటర్లో ఓకేసారి ఐదుగురికి డయాలసిస్ చేసే అవకాశం వున్నదని, దీంతో ఇల్లందు వైద్యశాల ప్రజలకు అన్నిరకాలగా ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు వైద్యంకొరకు సుదూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ కృషితో జిల్లా కలెక్టర్, డిసిహెచ్ఎస్ ల చొరవతో ఇప్పటికే వైద్యశాలలో వివిధరకాల శస్త్రచికిత్సలు, హిస్ట్ స్తతమి, టుబెక్తమి, చీముగడ్డలు తొలగించుట, అపెండి సైట్స్, కిలు, ఎముకలు సవరించటం, ట్రాక్టర్ ప్రమాదంలో ఓ మహిళకు తొంటి బొంగరం సరిచేయటం లాంటి వైద్యసేవలు అనేకం అందించామని తెలిపారు. అదేవిధంగా త్వరలో జిల్లా కలెక్టర్, డిసిహెచ్ఎస్ కృషితో క్నీ రీప్లేస్మెంట్ (మోకాలి చిప్పలమార్పిడి) చికిత్స కూడా ఇల్లందులోనే మొట్టమొదటిసారి చేయనున్నట్లు వారు తెలిపినారు. వైద్యశాలలో 24 గంటలు వైద్యసేవలు అందిస్తూ ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములవుతున్న డాక్టర్స్, నర్సులు మరియు వైద్యసిబ్బందిని వారు అభినందించారు. కోట్ల రూపాయలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి అందుబాటులో వుంచటం వల్ల ఇల్లందు పరిసర ప్రాంతప్రజల చిరకాల కోరిక తీరిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !