చికాగో అమరవీరుల రక్త తర్పణమే మేడే.*
కార్మికుల పని ప్రాంతాల్లో 137వ మేడే ను ఘనంగా నిర్వహించాలి.
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు .. భూక్యా రమేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అసంఘటిత కార్మికులు పని ప్రాంతాల్లో మేడే ను ఘనంగా నిర్వహించాలను సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలో అసంఘటిత కార్మికుల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే విశిష్టత ను తెలుపుతూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. పలు ప్రాంతాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడే ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదనీ, 8 గంటల పని దినాల కోసం, పోగుబడ్డుతున్న సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయాలని, పనికి తగ్గ ప్రతిఫలం దక్కించుకోవాలని జరిగిన మహా ఉద్యమంలో అమర వీరులు తమ ప్రాణాలని తృణ ప్రాయంగా ప్రపంచ కార్మికులకు పోరాట లకు దిక్సూచిగా అర్పించిన చికాగో అమరవీరుల రక్త తర్పణమే మేడే అని అన్నారు. మేడే సందర్భంగా అన్నీ ప్రాంతాల్లో ఎర్ర జండలను, దిమ్మెలని, తోరణాలు అలంకరించి ఒక పండగ వాతావరణం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, వెంకటేశ్వర్లు, పాష, లక్ష్మి, సుమ తదితరులు పాల్గొన్నారు.