వ్యవసాయ న్యాయసహాయ కేంద్రాన్ని ప్రారంభించిన సివిల్ జడ్జి ముఖేష్
రైతులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడమే ‘వ్యవసాయ న్యాయసహాయ కేంద్రం’
ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్
మన్యం న్యూస్,ఇల్లందు:రైతులకు వ్యవసాయ చట్టాలు, రైతుసంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ న్యాయసహాయ కేంద్రాలు రైతులకు మరింతగా ఉపయోగపడతాయని ఇల్లందు సివిల్ జడ్జి ముఖేష్ తెలిపారు. రైతువేదికలలో రైతువ్యవసాయ న్యాయసహాయ కేంద్రాలను సుదిమళ్ళ గ్రామపంచాయతీలో, ఇల్లందులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, చైర్మన్ జె.ముకేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులకు చట్టబద్ధంగా అందాల్సిన ఫలాలు, రైతు సాధికారతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ క్లినిక్ లు పనిచేస్తాయని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం నుండి శిక్షణ పొందిన పారాలీగల్ వాలంటీర్ ఆధ్వర్యంలో ఈ క్లినిక్ లు పనిచేస్తాయని అన్నారు. శిక్షణ పొందిన పారాలీగల్ వాలంటరీ రైతులకు ఉచిత న్యాయసహాయం అందించడంతో పాటుగా రైతు సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. విత్తన చట్టం ప్రకారం ధ్రువీకరించిన కంపెనీ విత్తనాలను, పురుగు మందులను రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యప్రకాష్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జె.మరియన్న, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.వాసవిరాణి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్, ఎల్.శ్యాంబాబు, జిల్లా రైతు సమన్వయసమితి సభ్యులు పి.మాధవరావు, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ఆత్మ కమిటీ ఛైర్మెన్ బావ్ సింగ్, న్యాయవాదులు ఉమామహేశ్వరరావు, కార్తీక్, పారాలీగల్ వాలంటరీ సతీష్ ఖండేల్వాల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.