మన్యం న్యూస్, ఇల్లందు టౌన్ ..వ్యర్ధానికి అర్థం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని పలు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న మానవ వ్యర్ధాల శుద్ధికరణ కేంద్రం (ఎఫ్ఎస్టిపి) ప్లాంటు ఇల్లందు పట్టణంలో పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాంటును ఇల్లందు పురపాలక చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్ పనితీరును అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పురపాలశాఖమంత్రి కేటీఆర్ మరియు సీడీఎంఏ కమిషనర్ అరవింద్ కుమార్, ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ల చొరవతో భద్రాద్రిజిల్లాలోని మొదటి ఎఫ్ఎస్టిపి ప్లాంటును ఇల్లందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. మానవ వ్యర్ధాల శుద్ధికరణ కేంద్రం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, వ్యర్థంతో అర్థం తెచ్చేందుకు అంటురోగాలు ప్రబలకుండా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్టిపి ప్లాంట్ల నిర్మానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఇల్లందులో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ నిండిన వెంటనే పురపాలక సంఘానికి సమాచారం ఇచ్చి మున్సిపాలిటీ సేవలను పొందాలని పట్టణప్రజలకు తెలిపారు.