మేడే”ఉత్సవాలు గణాంగా నిర్వహించాలి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం ఆఫీస్ నందు పార్టీ మండల కమిటీ సమావేశం పర్సిక రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలలో మేడే ఉత్సవాలు వారం రోజులపాటు నిర్వహించాలని .ప్రతి గ్రామంలో ఎర్రజెండా మే డే సందర్భంగా ఎగరవేయాలని వారు కోరారు . మండలంలో గిరిజనుల కోసం పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసేది సిపిఎం పార్టీ అని వారు కొనియాడారు .సిపిఎం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పారు .ఈ మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని రాబోయే ఎన్నికల్లో సిపిఎం పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలకు సూచించారు. మే డే సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి కార్మికుడు మేడే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి .శ్రీను ,జిల్లా నాయకులు వంక .రాములు గ్యానం. వాసు ,మండల నాయకులు తోట .నాగేశ్వరావు ,గుండమల్ల ప్రసాదు ,ఇర్ఫా. శీను గంగినబోయిన . కృష్ణ తదితరులు పాల్గొన్నారు.