మన్యంన్యూస్ :
హైదరాబాదులోని ఐడీసీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శనివారం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి కార్యాలయం నందు ప్రత్యేక సమావేశం అయ్యారు, ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్లో ఉన్న పలు మైనర్ ఇరిగేషన్ స్కీములు మరమ్మత్తులు, ఇతర పెండింగ్ కాలువలు పనులపై సమీక్ష, కొత్త లిఫ్టుల పై డిపిఆర్ లు రెడీగా ఉన్న లిస్టులను త్వరగా ప్రారంభం చేయాలని ఐడిసి చైర్మన్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ వేణుగోపాల చారి సాధ్యమైనంత త్వరగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎండీ విద్యాసాగర్ పాల్గొన్నారు…