UPDATES  

 గిరి పల్లెల్లో నీలి విప్లవం

గిరి పల్లెల్లో నీలి విప్లవం
చేపల పెంపకం,ఆర్థిక సాధికారత వైపు గిరిజన మత్స్య పారిశ్రామిక సంఘాలు.
ఐటీడీఏ పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం

మంగపేట మండలంలోని కొత్తూరు మోట్లగూడెం గ్రామంలో గల రాజారామ్ చెరువు లో స్పెషల్ డ్రైవ్-2 లో భాగంగా మూడు గ్రామాలకు తొంద్యాల లక్ష్మీపురం 20 మంది సభ్యులు,బొమ్మాయి గూడెం 18 మంది, కొత్తూరు మోట్లగూడెం 21 మంది,
మొత్తము 49 మంది గిరిజన మత్స్యకారులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.జిల్లా మత్య్స శాఖ అధికారి శ్రీపతి మాట్లాడుతూ.వలలు విషరడం,ఈత కొట్టడం,వల లాగడం లాంటి మూడు రకాల పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.పెసా జిల్లా సమన్వయ కర్త కొమురం ప్రభాకర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల్లో నీలి విప్లవాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.ఉచిత చేప పిల్లలతో పాటు తెప్పలు 75 శాతం రాయితీ తో మోటార్ వాహనాలు ఇస్తుందన్నారు.జీవిత బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తుంద న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి పిల్లి శ్రీపతి, క్షేత్ర అధికారి రమేష్,తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కబ్బాక శ్రావణ్ కుమార్,మత్య్స సిబ్బంది క్రిష్ణ, పెసా మోబిలైజర్ మంకిడి మహేందర్,బిఎల్ఓ మోహన్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !