వాడవాడలా మేడే ఉత్సవాలు జరుపుదాం
కార్మిక వ్యతిరేఖ విధానాలపై నిరసనగా మేడేను జరుపుదాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను మే 1న బస్తీలు, గ్రామాలు, కార్మిక క్షేత్రాల్లో ఘనంగా జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా పార్టీ, యూనియన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు శనివారం జరిగిన కొత్తగూడెం పట్టణం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల విస్తృత జనరల్ బాడీ సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతోందని, ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చివేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు, పరిశ్రమల యాజ్నమ్యాలకు కార్మికుల శ్రమను చాచిపెడవుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను, సంస్థలను అదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టి కార్మికులను, ఉద్యోగులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితిలో మేడే ఘనంగా జరిపి కార్మికులు, ఉద్యోగులు, ప్రజల వ్యతిరేకతను కేంద్రానికి చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు వై శ్రీనివాసరెడ్డి, దమ్మాలపాటి శేషయ్య, భూక్యా దస్రు, కంచర్ల జమలయ్య, కె రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, దీటి లక్ష్మీపతి, భూక్యా శ్రీనివాస్, అక్తర్, జక్కుల రాములు, రాంబాబు, అబ్బులు, ఆరేళ్ళు కృష్ణ, పాషా, యాకూబ్ పశ తదితరులు పాల్గొన్నారు.