మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 29::
మండలంలోని తహాసిల్దార్ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు 56,06,496 రూపాయలు కల్యాణ లక్ష్మి చెక్కులను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి దస్త్రాలను వెంటనే తన దగ్గరికి ఆమోదానికి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తహాసిల్దార్ ప్రతాప్ ఎంపీపీ రేసు లక్ష్మి జడ్పిటిసి సీతమ్మ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ నాయకులు వెంకటరమణ రెడ్డి చలపతి కనుబుద్ది దేవ శివ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.