మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో.. మేనెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొత్తగూడెంలోని 3 ఇంక్లైన్ గ్రౌండ్ నందు 14 సంవత్సరాల లోపు బాల, బాలికలకు రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని నెలరోజులపాటు ఉదయం, సాయంత్రo, నిర్వహించనున్నట్లు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, శిక్షకులు పి .కాశీ హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు, శిక్షణలో పాల్గొనదలచిన బాల, బాలికలుఈ నెల 31వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలలోపు వారి దరఖాస్తులను సంబంధిత శిక్షకులకు అందజేయాలని కాశీ హుస్సేన్ సూచించారు. బాల, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి శిబిరంలో అధిక సంఖ్యలోపాల్గొనే విధంగా సహకరించాలని ఆయన కోరారు. నెల రోజులు శిక్షణలో ప్రతిభ కనబరిచిన బాల,బాలికలకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు అందజేస్తుందని బాల ,బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కాశీ హుస్సేన్ కోరారు వివరాలకు సెల్ నెంబర్ 9949761181ను సంప్రదించాలని ఆయన కోరారు.