మేడే దినోత్సవ కానుకగా…
ఉచిత ఆరోగ్య క్యాంపులను కార్మికుల సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలననుసరించి మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య కేంద్రాలలో కార్మికులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉచిత ఆరోగ్య క్యాంపులు నిర్వహణపై శనివారం కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేశారు. ఆరోగ్య క్యాంపులు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. కార్మిక శాఖ నందు నమోదు కాబడి, గుర్తింపు కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికులందరికి మే డే సందర్భంగా కార్మిక శాఖ కామన్ సర్వీస్ సెంటర్ (సి ఎస్ సి) హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు ద్వారా కార్మికులందరి ఆరోగ్య పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఈ ఉచిత ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య పరీక్షా కేంద్రాలలో దాదాపు 50 కి పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. మే 1వ తేది నుంచి 3వ తేది వరకు హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి విడత మూడు కేంద్రాలలో హెల్త్ క్యాంపులు చేయడం జరుగుతుందని చెప్పారు.
మే 1, 2 తేదీలలో…
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పినపాక పట్టినగర్ గ్రామ పంచాయతి కార్యాలయంలోను 3వ తేదీన మండల పరిదిలోని ఉప్పుసాక గ్రామంలో ఈ ప్రత్యేక ఆరోగ్య క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.పైన పేర్కొన్న కేంద్రాలలో కార్మికులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహణ తదుపరి జిల్లాలోని మిగిలిన మండల కేంద్రాలలో క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే
కార్మికులు కార్మిక శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు రెన్యువల్లో ఉండాలని, ఆరోగ్య పరీక్షలు కొరకు కార్మికులు కార్మిక శాఖ జారీ చేసిన కార్డు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. కార్మికుల ఆరోగ్య
పరిరక్షణకు చేపట్టిన ఈ ప్రత్యేక ఆరోగ్య పరీక్షల ఉచిత క్యాంపులు మూడు రోజులే కాకుండా తదుపరి కూడా నిర్దేశించిన ప్రాంతాలలో నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఇతర వివరాలకు ఈ దిగువ తెలిపిన సహాయ కార్మిక అధికారి ఎండి షర్ఫుద్దీన్, కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ కే అక్బర్ అలీ నంబర్లు కు కాల్ చేసి సహాయతను పొందాలని ఆయన సూచించారు. 8247583686, 9985234236.