చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ పై సమర శంఖం పూరించాలి.
– భూక్యా రమేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మేడే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఎర్ర జెండా లు ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ పాల్గొని ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు మేడే జండాలు ఎగురవేస్తున్నమని, 8 గంటల పని దినాల కోసం మహత్తర పోరాటం జరిగిన చరిత్రను కాలారాస్తు నేడు బీజేపీ అధికారంలోకి వచ్చాక తిరిగి 12 గంటలు, 14 గంటల పని దినాలు పని రోజులు వచ్చాయని అన్నారు. అటువంటి దుర్మార్గ పాలనలో ప్రతి కార్మికుడు చైతన్య వంతంగా బీజేపీ పై తిరగబడాలి అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రింగు వెంకటయ్య, శ్యామ్, రాంబాబు, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు