మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండల పరిధిలోని కొమరారంలో అసమానతల, అణచివేతల దొరల పాలన నుండి విముక్తి, బహుజన రాజ్యాధికారం కొరకు తెలంగాణ భరోసా సభ, మే 7వ తారీఖున హైదరాబాదు సరూర్ నగర్ లోని విద్యార్థి అమరుల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జి మాయావతి వస్తున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు కంపాటి నరేష్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా బాదావత్ ప్రతాప్ ఇల్లందు నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు చేతుల మీదుగా గోడ పుత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, ఇది బహుజనుల ఆత్మగౌరవ సభ అని అన్నారు.ఎస్టి, ఎస్సి ,బిసి, మైనారిటీలు మరియు అగ్రవర్ణాలలోని పేదలు అందరూ బహుజనులే అన్నారు. బహుజనుల రాజ్యం వచ్చినప్పుడు మన బ్రతుకులు మారుతాయి అన్నారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి శ్రీనివాసరావు, బిఎస్సి పార్టీ ఇల్లందు మండల మరియు గ్రామ నాయకులు కంపాటి లాజర్, కుమ్మరి రాజు, తేలే కిరణ్, మధుబాబు,రామ్ ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు.