మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 30::
మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములకనపల్లి గుత్తి కోయల గ్రామంలో దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాలపై ప్రజా చైతన్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఏఎస్పి పంకజ్ కొత్తగూడెం ఓ ఎస్ డి సాయి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొత్తి గిరిజన అభివృద్ధికి ప్రజా సంక్షేమనకి మావోయిస్టు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు ఏజెన్సీలోని గుత్తి కోయ ప్రజలకు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరు కూడా మావోయిస్టులకి సహకరించొద్దని కోరారు దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులు సామాజిక సేవ కార్యక్రమంలో నిర్వహించారు అనంతరం గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో యువతకు క్రీడా సామిరిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ రేవతి ఎస్సైలు రవికుమార్ కేశవ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.