మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 30
మణుగూరు మండలం, తోగ్గుడెం గ్రామపంచాయతీ పరిధిలోని టిఆర్ఎస్ నాయకులు భూసిరెడ్డి.సైదమ్మ భర్త బూసిరెడ్డి.గూని రెడ్డి గత కొద్దిరోజులు గా అనారోగ్యంతో, బాధపడుతున్నారని తెలిసి ఆదివారం నాడు మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మేమున్నాము అంటూ వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ బొగ్గం. రజిత,వార్డు మెంబర్ భర్మవత్. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.