మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- మేడే సందర్భంగా ఇఫ్టూ జాతీయ కమిటీ ప్రచురించిన గొడ పత్రికను జిపి,బిఒసి,ఆటో కార్మికుల సమక్షంలో ఇల్లందు మండలం సుదిమళ్ళ పంచాయితీ లో ఆవిష్కరించారు.అనంతరం పూనెం శ్రీనివాసు అద్యక్షతన మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈకార్యక్రమంలో పాల్గొన్న ఇఫ్టూ నాయకులు ఉపేందర్ రావు మాట్లాడుతూ సమాన పనికిసమానవేతనం, 8గంటలపనిదినాన్ని రక్షించుకోవడం, భవన నిర్మాణ, ఆటో మోటార్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితర కార్మికులకు మెరుగైన వేతనాలు, సమగ్ర చట్టం కొరకు పోరాడాలని ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య పిలుపునిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో పూనెం భద్రం, మోకాళ్ళ శ్రీను,కోరం గాదేరాజు, వినోద్, రమేష్, విష్ణు, సతీష్,జాన్సన్,సురేష్,జలమయ్య,బంటి,చింటూ తదితరులు పాల్గొన్నారు.