మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం లో శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వెంకటాపురం, వాజేడు మండలాల కమిటీల ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముందుగా విజ్ఞేశ్వర పూజ అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల తర్వాత ఆర్యవైశ్యుల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.