మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి,ఏప్రిల్ 30: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రములోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ధూప,దీప,నివేదన కార్యవర్గ నూతన అర్చక సంఘం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ,ఉపాధ్యక్షులు అనిపెద్ద యశ్వంత్ శర్మ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి అమంచి సురేష్ శర్మ పాల్గొన్నారు.అనంతరం ధూప,దీప,నివేదన కార్యవర్గ అర్చక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కలిస వెంకటదుర్గ అంజనీ కుమార్ శర్మ,ఉపాద్యక్షులుగా ఆరుట్ల రాజగోపాలాచార్యులు,గౌరవ సలహాదారులుగా పెనుమర్తి సత్యనారాయణ మూర్తి,ప్రధాన కార్యదర్శి పురాణం కిరణ్ కుమార్ శర్మగా,కోశాధికారిగా కౌలి లక్ష్మి ప్రసాద శాస్త్రిలు నియమితులయ్యారు.అనంతరం ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని కార్యవర్గ సభ్యులు,అర్చక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.