అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలయ్యింది.
ఆ జట్టు నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 125 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 5 పరుగుల తేడాతో డీసీ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (59 నాటౌట్) ఒంటరిగా పోరాడుతూ తన జట్టుని గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. చివర్లో రాహుల్ తెవాతియా ఒక్కసారిగా మలుపు తిప్పినా, అతని ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. ఇషాంత్ శర్మ సూపర్బ్‌గా డిఫెండ్ చేశాడు. ఒక వికెట్ తీసి, కేవలం 6 పరుగులే ఇచ్చాడు. ఫలితంగా.. ఢిల్లీ జట్టు విజయఢంకా మోగించింది.