జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ మిడ్ సైజ్ SUVని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబోతోంది. దేశీయంగా కార్ మార్కెట్ పుంజుకోవడంతో పాటు ఇండియాలో మిడ్ సైజ్ SUV కార్లకు డిమాండ్ ఏర్పడటంతో దేశ, విదేశీ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లోకి వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ మోడల్ ను హెండా ఎలివేట్ అని పిలుస్తారని తెలుస్తోంది. 2023 పండగ సీజన్ ప్రారంభానికి ముందు భారత్ తో ఈ కార్ లాంచ్ చేయబడుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో హెండా కు సంబంధించి అమేజ్, ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ రెండు మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. WR-V, జాజ్ కార్లను హోండా నిలిపేసింది. హోండా ఎలివేట్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్, వోక్స్ వాగన్ టైగున్ కార్లకు పోటీగా ఉండబోతోంది. ఇండియన్ మార్కెట్ లో దీని ధర రూ. 10.50 లక్షల నుండి రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
బోల్డ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉండే అవకాశం ఉంది. క్యాబిన్ లోపల, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉండొచ్చు. దీంతో పాటు ADAS ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు సమాచారం.
హోండా ఎలివేట్ హోండా సిటీతో పవర్‌ట్రెయిన్ తో రాబోతోంది. 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్ తో 121 పీఎస్ శక్తితో, 145 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ ఉండనుంది.