అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ముగిసింది.
నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్ హకీమ్ ఖాన్ (51) అర్థశతకంతో రాణించడం.. అక్షర్ పటేల్ (27), రిపల్ పటేల్ (23) తమవంతు సహకారం అందించడంతో.. ఢిల్లీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. నిజానికి.. మొదట్లో ఢిల్లీ కేవలం 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం చూసి.. ఇక ఈ జట్టు 100 పరుగుల మార్క్‌ని అందుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో బరిలోకి దిగి.. అమన్ ఆపద్భాంధవుడిలా తన జట్టుని ఆదుకున్నాడు. అలాగే అక్షర్, రిపల్ సైతం తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు తెచ్చిపెట్టడంలో కృషి చేశారు.