UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..

దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది.

27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.

తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు యూఎస్ కంపెనీ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నిధుల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు.

మరోవైపు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లు ఫెయిల్ అవుతుండటం కూడా గోఫస్ట్ ను దెబ్బతీస్తోంది. ఈ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లలో ఫాల్ట్ ఉన్న ఇంజిన్ల కారణంగా నడవకుండా ఉన్న విమానాల సంఖ్య డిసెంబర్ 2019లో 7 శాతం నుండి డిసెంబర్ 2020లో 31 శాతానికి పెరిగి డిసెంబర్ 2022 నాటికి 50 శాతానికి చేరిందని ఎయిర్‌లైన్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాట్ & విట్నీ స్పేర్ లీజు ఇంజిన్‌లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తితే ఈ ఎయిర్ లైన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. గో ఫస్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తన వెబ్‌సైట్‌లో, విమానయాన సంస్థ తమ ఫ్లీట్‌లో 59 విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గోఫస్ట్ తదుపరి 3 రోజుల పాటు అన్ని విమానాలను రద్దు చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !