UPDATES  

 ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి అందుబాటులోఇక మన ఇసుక మన వాహనం జిల్లా కలెక్టర్ అనుదీప్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మన ఇసుక వాహనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు జిల్లా
కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఐడిఓసిలో కలెక్టర్ ఛాంబర్లో రెవిన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్, భూ గర్భ జలశాఖ, ఇరిగేషన్, టిఎస్ఎండిసి, పర్యావరణ ఇంజనీరింగ్, మిషన్ బగీరథ, వ్యవసాయ అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలోని
బూర్గంపాడు, ఉప్పుసాక, పాల్వంచ మండలంలోని దంతెలబోరు గ్రామాలలో ఇసుక రీచ్లు ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు చెప్పారు. టిఎస్ఎండిసి ద్వారా గోదావరిలో ఇసుక తీసేందుకు పినపాక మండలంలో ఆరు, మణుగూరు మండలంలో 3, అశ్వాపురం మండలంలో ఒకటి, చర్ల మండలంలో ఒకటి, దుమ్ముగూడెం మండలంలో మూడు,
భద్రాచలం మండలంలో ఒకటి మొత్తం 15 ఇసుక రీచ్లు ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు చెప్పారు. ఇసుక మేటలు వేసిన భూముల్లో అనుమతులు మంజూరుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయన ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని భూములలో ఇసుక తీసేందుకు అనుమతులు లేవని చెప్పారు. ఇసుక తీసేందుకు
రైతులు ధరఖాస్తులు చేసిన సందర్భంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని తప్పుడు నివేదికలు ఇస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టా భూముల్లో ఇసుక తీసిన
తదుపరి వ్యవసాయం చేస్తున్నారా లేదా వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు రీచ్లు ఏర్పాటుకు సిఫారసులను ఇరిగేషన్ సిఈ, జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా కమిటికి ప్రతిపాదనలు
పంపాలని చెప్పారు. అనుమతులు మంజూరు చేసిన ప్రకారం ఇసుక తీస్తున్నారా లేదా టిఎస్ఎండిసి పిఓ విచారణ చేపట్టాలని చెప్పారు. మాన్యువల్గా తీసేందుకు అనుమతిచ్చిన రీచ్లలో మాన్యువల్గానే ఇసుక తీయాలని, యంత్రాలు
వినియోగం ద్వారా ఇసుక తీయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఈ సమావేశంలో మైనింగ్ ఏడి జయసింగ్ ఇరిగేషన్ ఈఈ అర్జున్, శ్రీనివాస్, వెంకటేశ్వరావు, భూ గర్భజల
అధికారి బాలు, టిఎస్ఎండిసి పిఓ ఎల్లయ్య, డిఆర్డీ అశోక్ చక్రవర్తి, కలెక్టరేట్ ఏఓ గన్యా, భద్రాచలం తహసిల్దార్ శ్రీనివాస యాదవ్, పంచాయతీ, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !