UPDATES  

 ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన* మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించిన యూత్

మన్యం న్యూస్ గుండాల: మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాకారంతో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో గుండాల మండల  కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాల నందు నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పువ్వాడ  ఫౌండేషన్, మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో  ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని గ్రామాల నుండి ప్రజలు హాజరయ్యి కంటి పరీక్షలు చేపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అకౌంట్స్& ప్రోగ్రాం ఆఫీసర్ కే భానుచందర్ హాజరయ్యి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మండలంలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. నవచైతన్య యువజన సంఘానికి తగు సలహాలు సూచనలు చేస్తూ, భవిష్యత్తులో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  దామరతోగు ఎంపిటిసి కల్తి కృష్ణారావు, గుండాల ఉపసర్పంచ్ మానాల ఉపేందర్, మమత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సిబ్బంది, నవ చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఎస్కే ఆజాద్, సభ్యులు బత్తిని వినయ్, కోడూరి ప్రణయ్, మండలోజు వినయ్, కందుకూరి సంతోష్, శశి కుమార్, సతీష్, రాజేష్, ఎస్ కే వసీం , సౌరబ్, సిద్దు, వరుణ్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !