మన్యం న్యూస్, బూర్గంపాడు :
సఫాయిల గుర్తించి సమస్యలు పరిష్కరించిన నేత కెసిఆర్ అని పారిశుధ్య కార్మికులు కొనియాడారు. బుధవారం మండల పరిధిలోని సారపాక ప్రధాన కూడలి వద్ద పారిశుద్ధ్య కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.వెయ్యి చొప్పున పెంచుతూ..తక్షణం అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. సఫాయిల గుర్తించిన సమస్యలు గుర్తించిన నేత కెసిఆర్ అని పారిశుధ్య కార్మికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సారపాక గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, బూర్గంపహాడ్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
