UPDATES  

 ఆదివాసులారా వారపు సంతల బందుకు వ్యతిరేకంగా పోరాడండి -భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

మన్యం న్యూస్ చర్ల :
వారాంతపు సంతల బందుకు వ్యతిరేకంగా పోరాడండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరు తో లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో ఆదివాసుల యొక్క జీవన ఉపాధికి దోహదపడే ఈ వారపు సంతలను బందు చేయడం, వారి జీవనాల మీద దెబ్బ తీసినట్టు అని పేర్కొన్నారు. చర్ల ,దుమ్ముగూడెం, చింతూరు ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు చతిస్గడ్ వారపు సంతలైన బుడుగు పాడు, యాంపురం, భీమవరం, కొండపల్లిలో బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు లాంటి ఆదివాసుల జీవనానికి అవసరం అగు నిత్యవసర సరుకులు అమ్మి ఆదివాసుల అవసరాలను తీరుస్తుంటారు. అదేవిధంగా ఆదివాసులు సేకరించిన అటవీ ఉత్పత్తులు, పండించిన పంటలు వారు కొంటారు. ఇలా ఇక్కడ వస్తు మార్పిడి కూడా జరుగుతుంది. ఈ విధంగా అటు చిరు వ్యాపారస్తులు ఇటు ఆదివాసులు వారు బ్రతుకు బండిని లాగుతున్నారు. ఈ విధంగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులు మావోయిస్టులకు వస్తువులను, పేలుడు పదార్థాలను తీసుకొని వెళ్తున్నారని వారిని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వేధిస్తూ వారి యొక్క వాహనాలను పోలీసు వారు తీసుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా వారపు సంతలు బంద్ చేయడంతో ఆదివాసులు ఉత్పత్తులైన ఇప్పపువ్వు, చింతపండు మొదలగు వస్తువులను తీసుకొని చర్ల, దుమ్ముగూడెం,నల్లబెల్లి, కృష్టరం సంతలకు వెళితే ఇన్ఫార్మర్లు అనే నేపంతో అరెస్టు చేసి మావోయిస్టు సానుభూతిపరులు అని, మిలిషియన్ సభ్యులు అని దేశద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇలాంటి చర్యలు మానుకొని ఆదివాసులు జీవనానికి ఉపయోగపడు వారపు సంతాలకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా, ఆదివాసి అటవీ ఉత్పత్తులను సేకరించడానికి తగు చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ దృష్టి సారించాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !