- అకాల వర్సాలతో రైతు కంట నీరు.
- తడిసిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేయ్యాలి.
- తేమతో సాకుగా చూపి రైతులకు నష్టం చేయొద్దు.
- తేమ శాతంతో నిమిత్తం లేకుండా తడిసిన ముడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన్యం న్యూస్.ములకలపల్లి. మే 03.ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన దాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ నేతల బృందం సందర్శించారు.రైతులను కలుసుకొని జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ తడిసిన దాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, దాన్యాన్ని ఆరబెట్టుకొని రావాలని సంబందిత అధికారులు నిబంధన విధిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారని, తరచూ వర్షాలు కురుస్తుండటంతో దాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితులు లేకుండా పోయిందని,17శాతం తేమ అనే నిబందన వల్ల రైతాంగం నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. లక్షలాది ఎకరాల్లో పండించిన వరిదాన్యం, మొక్కజొన్న,అకాల వర్షాలకు తడిసి ఇంకా కళ్లాలోనే ఉందని, రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న ఈ దాన్యాన్ని 17 శాతం నిబందను విధించకుండా కొనుగోలు చేయాలని కోరారు, అకాల వర్షాలకు వరితోపాట మొక్కజొన్న, మిర్చి, మామిడి రైతులు సైతం పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులకు జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని,ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారంతో నిమిత్తం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి పరిహారం అందించాలని కోరారు. సాగుకోసం అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు తీర్చే స్థితిలో లేక, మళ్ళి అప్పులు చేసే దైర్యం లేక రైతన్నలు గుండెనిబ్బరం కోల్పోతున్నారని,ప్రభుత్వం నుంచి రైతులకు ఖచ్చితమైన హామీ ఇచ్చి నష్టపోయిన రైతుల కన్నీళ్ళు కన్నీళ్ళు తుడవాలని,యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జరిగిన నష్టంపై సర్వేలు చేపట్టి త్వరితగతిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినిధిబృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్ , రైతులు టి ఎన్ ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ నడిపల్లి నవీన్,నరాటి రమేష్,బైరు సాయి,ఎస్ కె మౌలానా,అనుముల సాయి,గొడ్ల కొండయ్య ,రాజు,దుర్గ ప్రసాద్,వీరు నాయక్,ఏమనియల్,తదితరులు ఉన్నారు.