మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 03
మణుగూరు ఏరియా లోని పివి కాలనీ సింగరేణి కంపెనీ క్వార్టర్స్ ఎలాట్మెంట్ ప్రక్రియ బుధవారం ఏరియా ఎంవిటిసి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఏరియా జిఎం జి.దుర్గం రామ చందర్ ఆదేశాల మేరకు చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించామని డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్ తెలిపారు.ఏరియా సింగరేణి ఉద్యోగులు కుటుంబ సౌకర్యార్ధం ప్రస్తుతం ఉన్న క్వార్టర్స్ కు బదులు,పివి కాలని నందు ఖాళీగా ఉన్న ఎంసి క్వార్టర్స్ ను కేటాయించాలని కోరగా,ఖాళీగా ఉన్న 15 క్వార్టర్లకు గాను 24 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు అని,దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎంవిటిసి కార్యలయం నందు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.13 మంది ఉద్యోగులు ఛేంజ్ ఆఫ్ క్వార్టర్ కౌన్సిలింగ్ పాల్గొన్నారు అని,సీనియారిటీని పరిగణ లోకి తీసుకొని ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను అధికారికంగా కేటాయించడం జరిగింది అని డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, టీబిజీకేఎస్ యూనియన్ నాయకులు డి.వీరభద్రం, జూనియర్ అస్సిస్టెంట్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.