హలో చెప్పండమ్మ సమస్య ఏమిటి…?
డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమానికి విశేష స్పందన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం మంచి స్పందన లభించింది. జిల్లా ఎస్పీ స్వయంగా
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజల సమస్యలు,ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.వెంటనే సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 15 మంది భాదితులు తమ సమస్యలు,ఫిర్యాదులను ఎస్పీ ని సంప్రదించారు.ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలుసుకోలేని వారు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
