UPDATES  

 కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య

  • కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య
  • కొత్తగూడెం బరిలో ఉంటానన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
  • భద్రాద్రి జిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం… ఎమ్మెల్యే పోదెం వీరయ్య
  • మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
    కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను అందరిని చైతన్యమంతం చేయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని
    డిసిసి అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసపూరిత హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం పై గొంతు ఎత్తుతున్న కాంగ్రెస్ నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాహుల్ రాహుల్ గాంధీని చూసి భయపడుతోందని అన్నారు. అదాని కొమ్ముకాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీయడాన్ని తట్టుకోలేక ఆయనపై మోడీ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది అని ఆరోపించారు. నేడు దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంస్కరణలే అందుకు కారణమన్నారు. తెలంగాణను కూడా సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. కెసిఆర్ కుటుంబ పాలనతో అప్పుల పాలయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్, లీక్ ల స్కాంతో రాష్ట్ర ప్రతిష్టను బ్రష్టు పట్టించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానీదే అని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో పాటు మిగిలిన నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుపొందుతుందని దీమ వ్యక్తం చేశారు. అనంతరం నాగ సీతారాములు మాట్లాడుతూ కాంగ్రెస్ లో ప్రతి నాయకుడు ఓ కార్యకర్తల్లా పనిచేస్తున్నమని అన్నారు.  కార్యాలయాలు ఎన్ని ఉన్న అందరి కాన్సెప్ట్ ఒక్కటే అన్నారు. అధిష్టానం ఆదేశానుసారం ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజవర్గంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే మరింత  చేరు చేసేందుకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గత 32 ఏళ్లుగా తన తండి ఆశీస్సులు, ఆశయం కోసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతు, కార్యకర్తలకు కష్టాల్లో తోడుగా ఉంటున్నట్టు తెలిపారు. . నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పార్టీ బాధ్యతలు భుజాలపై వేసుకొని పెద్దదిక్కుగా ముందుకు సాగానన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతానని పదవుల కంటే ప్రజా సమస్యలపై పోరాడటమే ముఖ్యమన్నారు.  పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విద్యానగర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపిన ఆయన టికెట్ రాకపొతే పార్టీ ఫిరాయించె వారికి, పార్టీ టికెట్ కోసం జిమ్మిక్కులు చేసేవారిని పార్టీ గమనిస్తుందన్న ఆయన కొత్తగూడెం బరిలో బీసీ అభ్యర్థిగా బరిలో ఉంటానని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల ఆశీస్సులతో కొత్తగూడెం బరిలో నిలిచి గెలిచి తిరుతానన్నారు. రాహుల్ గాంధీ నేత్రుత్వంలో కేంద్రంలో, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, చండ్రుగొండ మండల జడ్పిటిసి వెంకటరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వీరబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ కే అబీద్, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ కరీం పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పైడ ప్రసాద్, సుజాతనగర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు లోశెట్టి నాగార్జున, ఓబీసీ అధ్యక్షులు కే లక్ష్మణ్, ఓబీసీ కొత్తగూడెం మండల అధ్యక్షులు జయప్రకాష్, ఓబీసీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు వీరబాబు, పాల్వంచ, మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లమోతు రమణ, నర్సింగ్ బిక్షం, గరిపేట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డే బోయిన వెంకన్న, శ్రీను, యువజన కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ తేజావత్ శ్రీను, యువజననాయకులు తేజావత్ సాయి, ఉప్పరపల్లి లింగన్న, ప్రసాద్, శివ, ఏరా వెంకన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !