మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 03: అశ్వారావుపేట కి చెందిన జుజ్జారపు శ్రీ రామమూర్తి కి ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున శ్రమ శక్తి అవార్డు అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శ్రీ రామమూర్తి ని అభినందించారు. బుధవారం ఎమ్మెల్యే మెచ్చా స్వగృహంలో రామూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ 35 సంవత్సరాల సర్వీస్ లో కార్మిక నాయకుడిగా సేవలందించినందుకు గాను ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చిందని అన్నారు. అవార్డు వచ్చినందుకు అభినందించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి శ్రీరామ మూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ల జిల్లా అధ్యక్షుడు చిప్పనపల్లి శ్రీను, జుజ్జారపు రాంబాబు, జుజ్జారపు క్రాంతికుమార్ పాల్గొన్నారు.
