ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించడం గర్వకారణం
నిర్వాహకుడు బృహస్పతిని అభినందించిన పలువురు ప్రముఖులు
మన్యం న్యూస్, పినపాక:
ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. బుధవారం నాడు సీతారామపురం పంచాయతీలో నిర్వాహకుడు శ్రీరామ్ బృహస్పతి నెలకొల్పిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఏజెన్సీ వాసులకు ఉచితంగా పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కోచింగ్ తీసుకోలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ రాజారావు, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ముక్కు వెంకట నర్సారెడ్డి, సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, ఎంపీటీసీ సత్యం, ఎంపీఓ జయపాల్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి పద్మనాభరాజు, పినపాక సర్పంచ్ నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము తదితరులు పాల్గొన్నారు.