మన్యం న్యూస్ గుండాల..తుపాకులు కలిగి ఉంటే వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలం రాయగూడెం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అవగాహన కలిగించారు నాటు తుపాకులు, వేట కొడవళ్ళు ఇతర మారణ ఆయుధాలు ఏమైనా ఉంటే తక్షణమే పోలీసులకు ఇవ్వాలని అన్నారు స్వయంగా వారే అప్పగిస్తే వారిపై ఎలాంటి కేసులు ఉండవని ఆయన పేర్కొన్నారు. పోలీస్ శాఖ తనిఖీలలో మారణాయుధాలు దొరుకుతే ఆయుధాలు కలిగి ఉన్న వారిపై కేసు నమోదు చేయబడుతుందని అన్నారు. వేటకు వెళ్లి అడవి జంతువులను వేటాడరాదని అన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సై రతీష్ , అదనపు ఎస్ఐ అరుణ్ కుమార్, ఏ ఎస్ ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీను పాల్గొన్నారు.
