మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 4: మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా వివోఏ లు నిరవధిక సమ్మెకు చేస్తున్న వారికి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ గురువారం మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివోఏ లు గ్రామాలలో ఉన్న పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని,పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముఖ్య కారణం వివోఏ అని వారిని అన్ని రకాలుగా వాడుకొని ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు.వివోఏలా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాసరావు,మండల అధ్యక్షుడు బాల వెంకటరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి బాల కిరణ్ రెడ్డి,మండల ఓబిసి ప్రధాన కార్యదర్శి జబ్బురు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
